Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్హర్ లో కానరాని తల్లిపాల వారోత్సవాలు.!

మల్హర్ లో కానరాని తల్లిపాల వారోత్సవాలు.!

- Advertisement -

అంగన్ వాడి కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
నవతెలంగాణ – మల్హర్ రావు

తల్లీపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డకు శ్రీరామ రక్ష.పాలివ్వడం ద్వారా బిడ్డతోపాటు తల్లికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 1 నుంచి 7 వరకు అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలు జారీ చేసింది. ఈ క్రమంలో మొదటిరోజు జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.

తరువాత నుంచి భూపాలపల్లి జిల్లాలో  పలు మండలాల్లో తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కానీ మల్హర్ మాత్రం ఇంకా కానరాలేదు. మండలంలో తాడిచెర్ల, వల్లెంకుంట రెండు సెక్టార్లలో 38 అంగన్ వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిపై సంబంధించిన ఉన్నతాధికారుల పర్యావరణ లేకపోవడంతో తల్లిపాల వారోత్సవాలు కానరావడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి గర్భిణీలు, చిన్నారులు, చిన్న పిల్లల తల్లులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -