Tuesday, August 4, 2026
E-PAPER
Homeకరీంనగర్ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి వివేక్

ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి వివేక్

- Advertisement -

నవతెలంగాణ-రుద్రంగి
రుద్రంగి మండల కేంద్రంలో రూ.46 లక్షలతో నిర్మించనున్న ఆధునిక సాంకేతిక కేంద్రం పనులకు తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, కర్మగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా రాబోయే యువ తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్.బి గీతే, ఇతర శాఖల అధికారులు, సర్పంచ్ గండి నారాయణ, ఎఎంసి చైర్మన్ చెలుకల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -