Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ విద్యార్థులకు అక్షరాభ్యాసం

బస్వాపూర్ విద్యార్థులకు అక్షరాభ్యాసం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఎంపియూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం, నూతన ఎన్రోల్ మెంట్ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు జై చంద్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రమణమ్మ సురేష్ గొండ, ఉప సర్పంచ్ అనీల్ కూమార్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జీపీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను అడ్మిషన్ చేసుకున్నారు. విద్యార్థులకు అక్షరాభ్యాసం అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు పలకలు, బల్పాలు , ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో జిపి కార్యదర్శి భరద్వాజ్,  గ్రామ పెద్దలు బసవరాజ్ పటేల్, సురేష్ గొండతో పాటు ఉపాధ్యాయ బృందం రుక్సానా, సుభాష్ పటేల్ , మధు, తుకారాం, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -