Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంమాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత

మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జ్ఞాన్‌దేవ్ యశ్వంత్రెవ్ (డి.వై.) పాటిల్ (90) కన్నుమూశారు. వయోభారం వల్ల ఎదురైన ఆరోగ్య సమస్యల కారణంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం వ్యక్తం చేశారు. “ప్రముఖ విద్యావేత్త, సంస్థల నిర్మాత, పద్మశ్రీ డాక్టర్ డి.వై. పాటిల్ మరణం విచారకరం. విద్య, వైద్యం, ప్రజాసేవ రంగాలలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -