Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఏఓ

విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఏఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధిలో గల గ్రామాలలో మంగళవారం నుంచి వారం రోజుల పాటు విత్తన మేళా నిర్వహిస్తున్నామని మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి తెలిపారు. విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా ఫర్టిలైజర్ దుకణాదారులు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని, లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. వాతావరణానికి తగ్గట్టు పంటలను వేసుకోవాలని రైతులకు అవగాహన చేశారు. నానో యూరియా, నానో డీఏపీ ఉపయోగాలను కూడా రైతులకు స్పష్టంగా వివరించారు. అనంతరం విత్తనాలు, నానో యూరియా, నానో డీఎపి ఎరువులను ఏవో తన చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రేసివ్  రైతులు, సన్నాఫ్ చిన్న కారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -