Tuesday, June 23, 2026
E-PAPER
Homeఖమ్మంకార్పొరేట్లకు ‘రాయితీలు’ సామాన్యుడిపై ‘ధరల’ గుదిబండ

కార్పొరేట్లకు ‘రాయితీలు’ సామాన్యుడిపై ‘ధరల’ గుదిబండ

- Advertisement -

– ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) నిప్పులు
– పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి 
– జిల్లా నాయకుడు మోరంపూడి పాండురంగారావు డిమాండ్ 
నవతెలంగాణ-​సత్తుపల్లి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల పన్ను రాయితీలు, ఉచిత భూములు, సబ్సిడీలు ఇస్తూ సామాన్య ప్రజలపై మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల రూపంలో మోయలేని భారాలు మోపడం అత్యంత దారుణమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీ సత్తుపల్లి పట్టణ  కమిటీ సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాండురంగారావు మాట్లాడుతూ ప్రభుత్వాల వైఖరిపై నిప్పులు చెరిగారు.

​దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల చేతుల్లో కేంద్రీకరించే ప్రమాదకర విధానాలను ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలన్నారు. ఒకవైపు నిరుద్యోగం, ధరల పెరుగుదలతో సామాన్యుడు అల్లాడుతుంటే, మరోవైపు ధనవంతులైన కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల రుణమాఫీలు చేయడం ప్రజా వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి పిల్లలు ఒకప్పుడు చదువుకునే రోజులు ఉండేవని, కానీ నేడు చదువును కొనుక్కునే రోజులుగా మార్చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజులను వెంటనే నియంత్రించి, కార్పొరేట్ దోపిడీ నుంచి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కాపాడాలని డిమాండ్ చేశారు.

​ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి, కేవలం కార్పొరేట్ల లాభాల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారరని హెచ్చరించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమని, పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి పేదలకు ఉపశమనం కలిగించాలని పాండురంగారావు డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపిఐ(ఎం) ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. ​ఈ సమావేశంలో ఆ పార్టీ సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, నాయకులు రావుల రాజబాబు, చావా రమేష్, మోరంపూడి వెంకట్రావు, గుదే రాము, చప్పిడి భాస్కర్  పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -