నవతెలంగాణ-కమ్మర్ పల్లి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన వైపు ప్రయాణించాలని కమ్మర్ పల్లి ఎస్ఐ సతీష్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విధ్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, విద్యార్థులు తమ లక్ష్యాల వైపు పయనించాలని సూచించారు. డ్రగ్స్‌కు బానిస కావడం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబాలు ఎలా దెబ్బతింటాయో విద్యార్థులకు క్షుణంగా వివరించారు.మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్ఐ సతీష్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



