Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముందస్తు పారిశుద్ధ్య పనుల నిర్వహణ

ముందస్తు పారిశుద్ధ్య పనుల నిర్వహణ

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
వర్షాకాలం దృష్ట్యా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంన్నామని మున్సిపల్ కమిషనర్ డి.గజానంద్ తెలిపారు. పట్టణంలోని ఎనిమిదో వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చైర్ పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా పట్టణంలోని అన్ని వార్డులలో ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మురికి కాలువల శుభ్రం చేయడం. మురికి కాలువల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం. దోమలు పెరగకుండా దోమల లార్వా స్ప్రే చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్న తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటి లతజై జై నర్యయ్య. కౌన్సిలర్ సందీప్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -