పిడుగుపాటుకు ఎద్దు మృతి..

నవతెలంగాణ – పెద్దవూర
పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం లోని కుంకుడు చెట్టు పంచాయతీ పరిధిలోని నేరటోనీ గూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నీరుటి సైదయ్య అనే రైతు తన ఇంటిముందు వున్న వేప చెట్టు కు తనకు వున్న రెండు ఎద్దులను రోజులాగే కట్టేసి రాత్రి కావడం తో వారంతా ఇంట్లో పడుకున్నారు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయం లో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదైంది. ఈ క్రమంలో ఒకే సారి పిడుగు పాటుకు గురై అందులో ఒక ఎద్దు అక్కడి కక్కడే మృతి చెందింది.సైదయ్య రైతు వ్యవసాయ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. సుమారు రూ.70 వేల విలువ గల ఎద్దు మృతి చెందడంతో తాను జీవనోపాధి కోల్పోయానని రైతు సైదయ్య కుటుంభ సభ్యులు బోరున విలిపించారు. .వ్యవసాయమే అధారంగా బ్రతుకుతున్న తనకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు.మృతి చెందిన ఎద్దును చూడడానికి చుట్టూ పక్కల గ్రామాలనుంచి కాంగ్రెస్ నాయకులు తరలి వచ్చి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి వెళుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాకాల ఎల్లయ్య, నాయకులు దండు బిక్షం, నార్ల శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు.
Spread the love