నాటు సారా తయారు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు…

– ఎక్సైజ్ సిఐ నరేందర్
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్  ఎస్ సైదులు  ఆదేశాల మేరకు   భువనగిరి ఎక్సైజ్ టీం, డిటిఎఫ్ భువనగిరి  ఎక్సైజ్ టీం కలిసి సోమవారం భువనగిరి స్టేషన్ పరిధిలోని వివిధ తండాల్లో  విస్తృత తనిఖీలు నిర్వహించి (01) కేసు నమోదు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ నరేందర్ తెలిపారు. భువనగిరి మండలంలోని పచ్చర్ల బోడు తండా, బిబినగర్ మండలంలోని చిన్నరావుల పల్లి గ్రామాలలో సోదాలు నిర్వహించి అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న జాట్రోతు భగవంతు పై ఏ1 గా  కేసు నమోదు చేసి మరియు అతనికి బెల్లాన్ని ,  అట్టి నాటు సారాయి తయారీకి ముడి పదార్దాలను సరఫరా చేస్తున్న పబ్బతి సంతోష్ పై ఏ2 గా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాము అని ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భువనగిరి పి నరేందర్  తెలిపినారు.  సోదాలలో  సుమారుగా (10) లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకుని అలాగే (216) కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం  చేసుకుని కేసు నమోదు చేయడం జరిగినది అని తెలిపారు. భువనగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా నాటు సారా తయారు చేసిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సోదాలలో  డిటిఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాధా క్రిష్ణ  తో పాటు ఎక్సైజ్ ఎస్సై లు కె గణేష్, కె శ్రీకాంత్, పి వెంకన్న  ‌సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love