అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

A case has been registered against the person giving high interest loans – సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డి.ఎస్.పి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సిరిసిల్లలోని డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ కి చెందిన దుబాల మొండయ్య అనే వ్యక్తి  అవసరం ఉన్న వారికి అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి వారి నుంచి ఖాళీ బాండ్ పేపర్ల పైన  వారి సంతకాలు తీసుకోవడంతో పాటు ఇంటి పత్రాలను తాకట్టు పెట్టుకొని  అప్పులు కట్టని వారి ఆస్తులను స్వాదీనపర్చుకొవడం లేదా ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువ విలువ గల ఆస్తులు తన పేరు మీద కానీ ఇతరులకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసినట్టు అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నాడని డిఎస్పి పేర్కొన్నారు దుబాల మొండయ్య అనే వ్యక్తిపై పిర్యాదులు వస్తుండగా శనివారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు సిరిసిల్ల డిఎస్పీ  తెలిపారు. అధిక వడ్డీతో అప్పులు ఇచ్చినవారు చాలామంది ఉన్నారని, ఎవరైనా అధిక వడ్డీతో అప్పులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని వారిపై  చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ  తెలిపారు.

Spread the love