
నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపలగూడెం గ్రామంలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేస్తున్న మహిళపై కేసు నమోదు చేయడంతో పాటు పది లీటర్ల గుడంబాను స్వాధీనం చేసుకున్నట్లు పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ తెలిపారు. సోమవారం పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ కథనం ప్రకారం సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు దుంపెల్లి గూడెం గ్రామంలో గుడుంబా తయారు చేస్తూ విక్రయిస్తున్నారన్న సమాచారం రాగా అక్కడకు వెళ్లి తనిఖీ చేయగా అదే గ్రామానికి చెందిన వాగవత్ బంగారమ్మ ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థమైన గుడుంబాను కాస్తూ కంటపడడం జరిగిందనీ ఆమె నుండి పది లీటర్ల గుడుంబా ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. సంబంధిత నిషేధిత మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న బంగారమ్మ పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలను ఎవరు తయారుచేసిన విక్రయించిన చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా తయారు చేయడం గాని విక్రయించడం గాని దృష్టికి వచ్చినట్లయితే వెంటనే సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేరును గోపియంగా ఉంచుతామని అన్నారు. మత్తు పదార్థాల తయారీ విక్రయాలను స్థానిక ప్రజల సహకారంతో అరికట్టేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు.