
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. వ్యవసాయ, ప్రాథమిక విద్యా, వైద్య, ఆరోగ్యం, గ్రామీణ నీటి సరఫరా విభాగం, మిషన్ భగీరథ, రెవెన్యూ, పౌరసరఫరాలు, రోడ్డు, భవనాలు, విద్యుత్, ఈజీఎస్, శిశు సంక్షేమం, అటవీ, పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖలపై అధికారులు నివేదికలు అందజేశారు. గంట్లకుంట సర్పంచ్ చింతల భాస్కర్ రావు గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు సభలో లేవనెత్తారు. దీనిపై స్పందించిన విద్యుత్ అధికారులు త్వరలోనే సమస్య పరిష్కారిస్తామని చెప్పారు. అనంతరం ఎంపీపీ ఈదురు రాజేశ్వరి మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్తూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీఓ సత్యనారాయణ, ఏపీఎం నరేంద్ర కుమార్, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్, రవీందర్ నాయక్, ఎర్ర సబిత, బానోత్ విజయ, అనురాధ, సర్పంచులు జగ్గా నాయక్, గాజుల శోభ, కేతిరెడ్డి దీపిక, ధరావత్ రాజేందర్ నాయక్, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.