Wednesday, April 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూవివాదాల పరిష్కారంలో సువర్ణాధ్యాయం

భూవివాదాల పరిష్కారంలో సువర్ణాధ్యాయం

- Advertisement -

– కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్‌
– భూమి హక్కులకు శాశ్వత భరోసా : మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైతు జీవితం భూమితో ముడిపడి ఉందనీ, దానిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రంగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ హక్కును సర్వే మ్యాప్‌తో, భూధార్‌ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారించినపుడే రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా, భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుందని వివరించారు. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ల్యాండ్‌, సర్వే, రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ను ఈనెల రెండు నుంచి నారాయణపేట జిల్లా కోస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాప్‌ తప్పనిసరి అనే నిబంధనను భూభారతి చట్టంలో పొందుపరిచామని తెలిపారు.

ఎవరైనా స్వచ్ఛందం గా వారి ఆస్తులకు సంబంధించిన సర్వే సర్టిఫికేట్‌ కు కూడా దరఖాస్తు చేసుకుని ధృవీకరిం చుకోవచ్చని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ ఉండా లన్న నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని వివరించారు. మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలోని కూసు మంచి మండలంలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్‌ చేసి చారిత్రాత్మకమైన అడుగు వేశామని పేర్కొన్నారు. సర్వేమ్యాప్‌ తో తొలి రిజిస్ట్రేషన్‌ అయిన సందర్బంగా మంత్రి స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కూసుమంచి మండలంలోని గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్‌ 156/ఇ/1 లోగల ఒక ఎకరా నాలుగు గుంటల భూమిని నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయిం చారని తెలిపారు. ఆయన భూమి హద్దులతో కూడిన మ్యాప్‌ ను జతచేసి కూసుమంచి తహశీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రే షన్‌ చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి (భూ కమత పటం-1, భూధార్‌ నెంబర్‌ 795 (జీసీహెచ్‌డీసీయూపీజే7 హెచ్‌వో)ను తహశీల్ధార్‌ కేటాయించారని తెలిపారు. ఇదే విధానాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేవిధంగా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని వివరించారు.

భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. ప్రతి భూమికి ఖచ్చితమైన సర్వే మ్యాప్‌, ప్రత్యేక భూధార్‌ నెంబర్‌ కేటాయించడం ద్వారా యాజమాన్యంపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా చేస్తోందని భూభారతి పోర్టల్‌ ద్వారా ఈ సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సర్వే విషయంలో పాత విధానాలకు స్వస్తి చెప్పి అధునాతన రోవర్లను వినియోగిస్తూ కచ్చితత్వంతో సర్వే పూర్తిచేయిస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -