ఘనంగా నల్ల పోచమ్మ బోనాల పండుగ

నవతెలంగాణ – మోపాల్

ఆదివారం రోజున మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తల్లి నల్ల పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా లభించేందుకు, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఆ తల్లి ప్రసాదించాలని ఉద్దేశంతో బోనాలను నైవేద్యంగా ప్రజలందరూ సమర్పించడం జరిగింది. ముందుగా ప్రజలందరూ బోనాలను గ్రామం నడిబొడ్డున గల సరగమ్మల దగ్గర పూజించుకొని సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్ల పోచమ్మ వరకు బోనాలను ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో, తాళమేళలతో  తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ,స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామంలోని యువకులు గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘ సభ్యులు, మహిళలు పాల్గొనడం జరిగింది.

Spread the love