ఘనంగా బాల్ భవన్ వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం..

నవతెలంగాణ – సూర్యాపేట
ఈరోజు బాల్ భవన్ వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్రాంత అధ్యాపకుడు హమీద్ ఖాన్ గారు, జ్ఞాన సరస్వతి కళా సమితి అధ్యక్షుడు బుర్రి వెంకటేశ్వర్లు, మెడిటేషన్ ట్రైనర్ రమా రాజు గారు నటరాజ స్వామి గణపతి విగ్రహానికి, బాల్ భవన్ కృషీవలుడు కీర్తిశేషులు వనమా వెంకట రామయ్య గారి చిత్ర పటానికి పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్యాన్స్ డ్రాయింగ్ సంగీతం వాయిద్యం క్రాఫ్ట్ అంశాలలో నేర్చుకున్న నైపుణ్యాన్ని స్టూడెంట్స్ ప్రదర్శించగా పలువురిని ఆకట్టుకున్నాయి. స్టూడెంట్స్ చేసిన క్రాఫ్ట్ ను అతిథులకు కానుకగా ఇచ్చారు.తదుపరి అతిథులు మాట్లాడుతూ వేసవిలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇలా కళల్ని శిక్షణ పొందడం మంచి మార్పు అని, మానసిక వికాసం కోసం ప్రతి ఒక్కరు ఏదో ఒక అదర్ యాక్టివిటీ నేర్చుకోవాలని ఈ విద్య ఉపాధికి కూడా భవిష్యత్తులో పనికి వస్తుందని అన్నారు. సృజనాత్మకత మెరుగు పడుతుంది సంప్రదాయ కళలు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లిన వారం అవుతామని అన్నారు.
చదువుతో పాటు కళలు శిక్షణ పొందడం ప్రయోజనం ఉంటుంది అని ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది,స్టేజి ఫియర్ లేకుండా అందరితో కలిసి నడవడం నేర్చుకుంటారు అని అన్నారు. వీడియో గేమ్స్ టివి లు చూస్తూ కంటి చూపు పోగొట్టుకోవడం లేదా పెద్దల తోడు లేకుండా ఈతకు వెళ్ళి , టు వీలర్స్ నడుపుతూ ప్రమాదాలు బారిన పడటం జరుగుతుందని,పేరెంట్స్ పిల్లలను చెడు వ్యాపకాల వైపు వెళ్లకుండా బాల్ భవన్ పంపించి ఇలాంటి విద్యలు నేర్పించేందుకు ముందుకు రావాలని అన్నారు,అనంతరం పేరెంట్స్ మాట్లాడుతూ వేసవిలో బాల్ భవన్ శిక్షణ తమ పిల్లల్లో దాగిన నైపుణ్యాలను వెలికి తీయడానికి మరియు మెళకువలు నేర్చుకోడానికి ఉచితంగా శిక్షణ పొందడానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు తెలిపారు. తదుపరి బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి, సిబ్బంది దాసరి ఎల్లయ్య, సత్యనారాయణ సింగ్, ఉమ, అనిల్, సాయి, వీరయ్య,,పద్మ కలిసి అతిథులకు సన్మానం చేసారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ పేరెంట్స్ ఎండలకు ఓర్చుకుని సరైన భవన సదుపాయం లేక ఏర్పాటు చేసిన టెంట్లు కింద అయినా శిక్షణ పొందడానికి చాలా ఆసక్తి చూపారని అందరికీ ధన్యవాదములు తెలిపారు ,చివరగా 370 మంది స్టూడెంట్స్ కి ప్రశంసా పత్రాలు అందజేశారు.మళ్ళీ బాల్ భవన్ జూన్ 15 నుండి సంవత్సరం పొడవునా యధావిధిగా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నాం అని స్టూడెంట్స్ గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love