మామిడిపల్లిలో ఘనంగా ఊర పండగ..

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం “ఊర పండుగ” నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు, భాజా బజంత్రీలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని అందరూ బాగుండాలని గ్రామదేవతలను కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love