బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు, మాజీ సర్పంచ్ కు ఘన సన్మానం

నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ఇటీవల వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు రెంజల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు తో పాటు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానం జరిపారు. రెంజల్ తాజా మాజీ సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్, తో పాటు మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, ఉపాధ్యాయులు హనుమన్లు, గంగాధర్ లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love