నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం జరిపినట్లు గ్రామ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 31న గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు పదవి పూర్తి కానుండడంతో గౌరవ సభ్యులందరికీ ఘనంగా సన్మానం జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ వెలుమల సునీత నరసయ్య, ఉప సర్పంచ్ లక్ష్మి, గౌరవ ఎంపీటీసీ చింతకుంట లక్ష్మి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.