హైదరాబాద్ : 37వ జాతీయ సబ్ జూనియర్, కాడెట్ తైక్వాండో చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ పతకాల పంట పండించింది. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ త్వైక్వాండో క్రీడాకారులు 9 పసిడి, 3 రజత, ఓ కాంస్య పతకం సాధించారు. 29 రాష్ట్రాల నుంచి 900కి పైగా క్రీడాకారులు పోటీపడిన ఈవెంట్‌లో తెలంగాణ నుంచి బాలికలు, బాలుర విభాగాల నుంచి 40 మంది పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తైక్వాండో వర్థమాన అథ్లెట్లను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ త్వైక్వాండో సంఘం అధ్యక్షుడు ముఠా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, కోచ్ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.