గన్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య యత్నం..

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా రామ్ పురంలో 15 వ సీ. ఏ .ఎఫ్ బెటాలియన్ కు చెందిన మనోజ్ దినకర్ అనే జవాన్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. జవాన్ గా బాధ్యతలు నిర్వహిస్తోన్న మనోజ్ దినకర్ తన సర్వీస్ గన్ తో కాల్చుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది మనోజ్ దినకర్ ను జిల్లా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మనోజ్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ దినకర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆత్మహత్యయత్నంకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love