Friday, May 8, 2026
E-PAPER
Homeకరీంనగర్లెబర్ కార్డు ప్రతి కార్మికుడికీ తప్పనిసరి: లెబర్ ఆఫీసర్ నజీర్

లెబర్ కార్డు ప్రతి కార్మికుడికీ తప్పనిసరి: లెబర్ ఆఫీసర్ నజీర్

- Advertisement -

నవతెలంగాణ–వేములవాడ: కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని లెబర్ అడ్డా వద్ద శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా లెబర్ ఆఫీసర్ నజీర్ హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘లెబర్ కార్డు’ను తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన సూచించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా లభించే బీమా, ఆర్థిక సహాయం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఈ కార్డు ఎంతో ఉపయోగకరమని వివరించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ..
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రం, అంజి తదితరులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -