Friday, May 8, 2026
E-PAPER
Homeజిల్లాలునాగయ్య కుంటలో పది క్వింటాళ్ల చేపలు మృతి

నాగయ్య కుంటలో పది క్వింటాళ్ల చేపలు మృతి

- Advertisement -

రూ.1లక్ష నష్టం జరిగిందని లబోదిబోమంటున్న మత్సకారులు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకలు
నవతెలంగాణ – మల్హర్ రావ

మండల కేంద్రమైన తాడిచెర్ల కాపురం రెవెన్యూ శివారులోని నాగయ్య కుంటలో అంతుచిక్కని వ్యాధితో సుమారుగా 10 క్వింటాళ్ళ ఎదిగిన చేపలు మృత్యువాత పడి రూ.1లక్ష నష్టం జరిగినట్లుగా బాధిత మత్స్యకారులు కుంట భూమయ్య,చిగురు తిరుపతి శుక్రవారం కన్నీరుమున్నీరైయ్యారు.ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకొంటున్నారు.మత్స్యకారులు పూర్తి కథనం ప్రకారం ఏడాది క్రితం చేపపిల్లలు పొసినట్లుగా తెలిపారు.

ఒక్కొక్క చేప అరకిలో నుంచి కిలో వరకు పెరిగిందని, గత వారం రోజులుగా చేపలు విక్రయిస్తున్నట్లుగా పేర్కొన్నారు.అయితే నాలుగైదు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో చెరువులోకి నీరు చేరడంతో చేపలు పట్టేందుకు వీలు కాకపోవడంతో కొద్దీ రోజుల తరువాత పడతామనే క్రమంలో గురువారం సాయంత్రం నుంచే చెరువులో చేపలు మృత్యువాత పడి కనిపించాయని బాధిత మత్స్యకారులు ఆందోళన చెందారు.వెంటనే తహశీల్దార్ కార్యాలయంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పిర్యాదు చేసినట్లుగా తెలిపారు.తహశీల్దార్ రవికుమార్ ఆదేశాల మేరకు కాపురం జిపిఓ స్వర్ణలత,గ్రామ ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు,మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు కారుపాకల మొగిలి,ఉపాధ్యక్షుడు దేవర రమేష్,ప్రధాన కార్యదర్శి చొప్పరి రాజేందర్,ముదిరాజ్ సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు ముద్దరవేని సురేష్ ముదిరాజ్,కుల పెద్దమణులు చెరువులో చనిపోయిన చేపలను పరిశీలించినట్లుగా చెప్పారు.చేపల మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -