కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు.శుక్రవారం మండలం రుద్రారంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీదర్ బాబు హయాంలో మంథని నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు,పేదలకు సంక్షేమ పథకాలు అందయన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మోడల్ స్కూళ్ళు,ఇంజనీరింగ్ కళాశాలలు జెఎన్టీయూ,పాత రుద్రారంలో కాలేజిలు తీసుకొచ్చారని,పల్లెల్లోఅంతర్గత సిసి రోడ్లు,డ్రైనేజీలు, బ్రిడ్జిలు,కల్వర్టులు వేయించారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో రేషన్ కార్డులున్న పేదలకు సన్నబియ్యం, గృహజ్యోతిలో జీరో విద్యుత్,మహాలక్ష్మీ లో ఉచిత బస్సు,గూడు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు,చదువుకున్న యువత ఉపాది కోసం స్కిల్ డేవలాప్ మేంట్ కంప్యూటర్ కోర్డులు,మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లు అనేక సంక్షేమ పథకాలు అందుతూ అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నట్లుగా చెప్పారు.
బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్టాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేశారన్నారు.నాలుగున్నరేళ్ల పుట్ట పాలనలో మంథనిలో దళితులపై హత్యలు,మానేరుపై నిర్మించిన ఛెక్ డ్యామ్స్,కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత లోపాలతో నిర్మాణం చేయగా ఆదిలోనే కూలినట్లు,ఓడేడ్ బ్రిడ్జి గాలికి పడిపోయినట్లుగా,ఇసుక దోపిడీ జరిగినట్లుగా ఆరోపించారు.నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం పరితపించే తమ నాయకులు శ్రీదర్ బాబు,శ్రీనుబాబుపై బిఆర్ఎస్ నాయకులు స్థాయికి మించిన ఆరోపణలు చేయడం,దళితుల హత్యలపై ప్రశ్నించిన దండు రమేష్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,సర్పంచ్లు చంద్రగిరి సంపత్,కొండ రాజమ్మ,కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి అశోక్,భోగే మల్లయ్య,చంద్రమోహన్,చిగురు సదయ్య,గట్టయ్య,మహేష్ పాల్గొన్నారు.



