కరుణగిరి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి

A large number of devotees should participate in the Karunagiri mahotsavamనవతెలంగాణ – ఆళ్ళపల్లి 
 గురువారం నుండి మార్చి 2వ తేదీ వరకు జరిగే కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవాలకు ఆళ్ళపల్లి, గుండాల మండలాలలోని క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఆ ఏసు కృపను పొందాలని స్థానిక ఆర్.సీ.ఎం చర్చి ఫాదర్ కూరపాటి యాకోబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఫ్రాన్సిస్ పోప్ ఆరోగ్యం కుదురుకోవడానికి క్రైస్తవ భక్తులు ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుండి 4 రోజులపాటు ఖమ్మం కరుణగిరి కేదడ్రల్ చర్చిలో జరిగే పుణ్యక్షేత్ర జాతర మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు అనేకమంది విశ్వాసులు, గురువులకు, మటకన్యలు, భక్తులు ఉపదేషకులు, వివిధ గ్రామాల విశ్వాసులు ప్రతిరోజు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు, భక్తిరస కళా నృత్యాలు, కోలాటాల వంటి పలు రకాల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖమ్మం కరుణగిరి చర్చి ప్రాంగణాన్ని అలంకరించి, వచ్చిన అతిథులు, భక్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవ వేడుకల్లో భాగంగా బుర్రకథలు, సంగీత కచేరీలు సైతం జరుగుతాయని చెప్పారు. ఈ మహోత్సవాలకు ఖమ్మం కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్లు రెవరెండ్ ఫాదర్స్ వర ప్రసాదరాజు, ఆంథోనీ రాజు, ఖమ్మం జిల్లా జ్యోతిర్మయి డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ కాకమాను రాజు, గురువులు పాల్గొని దివ్యబలి పూజ సమర్పించడం జరుగుతుందని వివరించారు. ఈ మహోత్సవాలకు జ్యోతిర్మయి యానిమేటర్స్ శాంతారావు, పరమ ప్రభాకర్, ప్రసాద్ యేసు రాజు, బాబురావు దేవానందం, బాలస్వామి, వివిధ మండలాల, గ్రామాల ఉపదేశకులు పాల్గొంటారని తెలిపారు.
Spread the love