అక్షర నివాళి..!

Ramoji-Raoతెలుగు భాషకు ఉషోదయం
తెలుగు వెలుగుకు మహోదయం
అన్ని రంగాలో ఘనాభ్యుదయం
రామోజీరావు గారు చెరుకూరి
వినూత్న వాణిజ్యాలలో విజయ భేరి..!
మధ్య తరగతి ప్రజలకు మెరుగైన మార్గదర్శి
తెలుగు పత్రికా ప్రపంచంలో వెలుగొందుతున్న దీర్ఘదర్శి
చిత్ర రంగాలలో అలుపెరుగని మహా మహర్షి
ప్రియమైన రుచులకు నోరూరించే అభిరుచి
మయుడికే ఉన్న మతిని పోయేలా
స్వయం కృషితో దివ్య తేజస్సుగా
హైదరాబాద్‌లో నిర్మించిన ఫిల్మ్‌ సిటీ .!
రాజకీయాలకు కొత్త భాష్యం రచించగల విదురుడు
వర్తమాన రాజకీయాలను శాసించే చండ శాసనుడు
కృష్ణా జిల్లాలో ఉదయించిన చిన్ని రామోజం
వసుధ యంతా విస్తరించె మహా వృక్షమై..!
ఆయన ప్రగతి కిరణాలు జగతిలో తిమిర సంహరణాలు ..!!.!
– జి.సూర్య నారాయణ, దివిసీమ.

Spread the love