నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రమాదానికి గురైన లారీ రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో తరుచూ ట్రాఫిక్ జాం అయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గత సంవత్సర కాలంగా సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతుండటంతో రాకపోకలు తీవ్ర అంతరాయం కావడమే కాక పట్టణ ప్రజలు దుమ్ము బారిన పడుతున్నారు. దీనికి తోడు సోమవారం పేరాయిగూడెం డివైడర్ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొట్టు కోవడంతో ఓక లారీ మరమ్మత్తులకు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఈ కారణంగా మంగళవారం రోజంతా ట్రాపిక్ జాం అయి రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం అయి ఎస్.హెచ్.వో ఎస్సై యయాతి రాజు ను వివరణ కోరగా భారీ వాహనం కావడంతో కదిలే పరిస్థితి లేదని అయినప్పటికి దాన్ని తొలిగించి రాకపోకలు సజావుగా సాగడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.