ఎంపి బీబీ పాటీల్ కు తృటిలో తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – జుక్కల్: జహిరాబాద్ ఎంపి బీబీ పాటీల్  కు తృటిలో కారుప్రమాదం నుండి బయట పడటం సంఘటన  గురువారంనాడు  జర్గింది. ప్రత్యక్ష  సాక్షులు  తెలిపిన  వివరాల ప్రకారం గురువారం నాడు మద్నుర్ మండలంలో ఎవ్నికల ప్రచారం నిమత్తం హైద్రాబాద్ నుండి వస్తున్న క్రమంలో జుక్కల్ మండలంలోని  జుక్కల్  చౌరస్తా వద్ద  బైక్ పైన వేగంగా వస్తున్న ఇద్దరు యువకులు  ఎంపి వాహనం ముందుకు రావడంతో  అదుపు తప్పి ఎంపి వాహనం ముందు పడిపోయారు. ఎంపి వాహనం డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించడంతో డివైడర్ కు ముందు చక్రం తగిలి పెలిపోయింది. ఎంపికి ఎటువంటి ప్రమాదం జర్గకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉపిరి పిల్చుకున్నారు. యువకులు బైక్ తీసుకుని పారీపాయారు.  అనంతరం  ముఖ్యమంత్రి సబావేదిక పనులను పరీశీలించారు. సంఘటన స్థలానికి  కౌలాస్ సర్పంచ్ గొల్ల హన్మండ్లు ఇతర నాయకులు వచ్చి ఇంకో వాహనంలో ప్రచారానికి తిసుకెళ్లారు.

Spread the love