Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలునయా రొమాంటిక్ థ్రిల్లర్

నయా రొమాంటిక్ థ్రిల్లర్

- Advertisement -

సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ గురువారం పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి డైరెక్టర్ డాలీ క్లాప్ కొట్టి, గౌరవ దర్శకత్వం వహించారు. గంటా రవితేజ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నల్లమలుపు బుజ్జి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రంలో దివ్యాని మొండల్ కథానాయిక. ఈనెల 29 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ,’నేను 275 కు పైగా సినిమాలకు పని చేశాను. ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, అభిమానాన్ని అందించారు. ఇప్పుడు ఈ సిని మాతో మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే ప్రేమ, అభిమానాన్ని తనపై కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. దర్శకుడు వీరేష్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌ను రూపొందించారు. ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే కథ ఇది. నిర్మాత చక్రధర్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారుఅని తెలిపారు. 'నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా దర్శకుడు, నిర్మాతతో పాటు మా టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని హీరో సుస్వర తరంగ్ చెప్పారు. దర్శకుడు వీరేష్ కోకా మాట్లాడుతూ,’ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -