రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ-భిక్కనూర్:
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన సంఘటన భిక్కనూరు పట్టణంలోని 44వ జాతీయ రహదారి పై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం భిక్నూర్‌ పట్టణానికి చెందిన రామగిరి (35) ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన రామగిరి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనం పై ఇంటికి వస్తున్న రామగిరిని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మరణించాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Spread the love