మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్

– ఇరువర్గాల మధ్య పంచాయితీలు చేస్తా అంటూ డబ్బులు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– సిరిసిల్ల డిఎస్పీ భీంశర్మ
నవతెలంగాణ – సిరిసిల్ల
ముస్తాబాద్ మండలం సేవలలతండా గ్రామానికి చెందిన లకావత్ శ్రీరామ్ అనే వ్యక్తి  అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను వేధించగా అతనిపై ఫోక్సొ కేసు నమోదు అయింది. రాజీ పడేలా చేస్తానని లకావత్ మున్నా అనే వ్యక్తి 1.80 లక్షలు తీసుకొని రాజి కుదుర్చుకపోవడంతో లకావత్ శ్రీరామ్ ఫిర్యాదు చేయగా ఆయన ఫిర్యాదు మేరకు లకావత్ మున్న పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్ల డిఎస్పి భీమ్ శర్మ బుధవారం రాత్రి తెలిపారు డిఎస్పి కథనం ప్రకారం… ముస్తాబద్ పోలీస్ స్టేషన్లో 2019 సంవత్సరంలో లకావత్ శ్రీరామ్ అనే వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదుకాగా కోర్టులో కేసు పెండింగులో ఉంది. లకావత్ చిన్న మున్నా @ మున్యా నాయక్ అనే వ్యక్తి అ కేసు రాజీపడేలా మాట్లాడి పంచాయితీ చేస్తాను అని చెప్పి అందుకు లకావత్ శ్రీరామ్ ను 1,80,000/-  రూపాయలు డబ్బులు ఇవ్వాలని, డబ్బులు ఇస్తే కేసు రాజీ చేస్తాను అని డిమాండ్ చేయగా, అతని డిమాండ్ మేరకు 1,80,000/- రూపాయలు లకావత్ శ్రీరామ్ లకావత్ చిన్న మున్నా @ మున్యా నాయక్  తండ్రి  రెడ్డి నాయక్ గ్రామం సేవలలతండా అనే వ్యక్తికి ఇవ్వగా, ఆ తరవాత డబ్బులు తీసుకొని పంచాయతీ చేయలేదని లకావత్ శ్రీరామ్ లకావత్ చిన్న పై పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి  చిన్న మున్యాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపినారు.

Spread the love