ప్రణాళిక వుంటే చాలు

A plan is enoughకొన్నిసార్లు చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో టెన్షన్‌ వస్తుంది. ఆదరబాదరాగా పని చేయబోతే కొన్ని ఎదురు పనులు అవుతాయి కూడా. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు, పనులన్నీ చకచకా అయిపోయి టెన్షన్‌ని దూరం అవుతుంది. అవేంటో ఓ సారి చూద్దామా..!

ముందుగా చెయ్యాలనుకున్న పనుల జాబితా బుర్రలో కాకుండా ఓ పేపరుపై వరుసగా రాసుకోవాలి. అందులో ఇంటికి సంబంధించినవి ఓ వైపు, బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్‌ చేసి పెట్టుకోవాలి. ఇలా డివైడ్‌ చేసుకోవటం వల్ల చెయ్యాల్సిన పనుల పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకుం టున్నారో ముందుగా దాని మీద దష్టి పెట్టాలి. ఇలా ప్రాధాన్యతకు అను గుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసు కోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. పనులన్నీ ఒకే సారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి, పనులు చకచకా అయిపోతాయి.
– బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో.. ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్‌ పేరు పక్కన రాసుకోవాలి. ఎక్కువగా ఏ ప్లేస్‌కి వెళితే చాలా పనులు పూర్తి చెయ్యచ్చో స్పష్టత వస్తుంది. దానికి తగ్గట్టుగా వెళితే లిస్టులో పనులూ తగ్గుతాయి. పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా త్వరగా అయిపోతాయి. అందుకే మొహమాటం కాస్త ఆప్యాయంగా అడిగి పూర్తి చేసుకుంటే మంచిది. ఇలా చేస్తే ఎన్ని పనులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా గందరగోళ పడకుండా పూర్తి చేసుకోవచ్చు.

Spread the love