ప్రజా సమస్యలు పట్టని ప్రధాని

ప్రజా సమస్యలు పట్టని ప్రధాని– కేవలం అధికారాన్ని అనుభవిస్తున్నారు
– మోడీ చుట్టూ భజనపరులు..
– విపక్షాలను బద్నాం చేయటమే బీజేపీ పని : ప్రియాంక గాంధీ
జలోర్‌ : ప్రజలు, వారి సమస్యల నుంచి ప్రధాని మోడీ దూరమయ్యారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. మోడీ విస్తృత అధికా రాలను అనుభవిస్తున్నారని, ఆయన చుట్టూ ఉన్నవారు నిజం చెప్పడానికి భయపడుతున్నారని అన్నారు. ”దేశ అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం. మోడీజీ దాన్ని కూడా అర్థం చేసుకోలేకపో తున్నారని నేను నమ్ముతున్నాను” అని ప్రియాంక గాంధీ రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జలోర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సంద ర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ”భారతదేశం లో జీ 20 సమ్మిట్‌ వంటి సంఘట నలు జరిగినప్పుడు మేము కూడా గర్వపడుతున్నాము. అయితే మరొక వాస్తవం ఏమిటంటే పేద ప్రజలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కారణంగా యువకులు బాధపడుతు న్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం లేదని విమర్శిం చారు. ”ఆ పార్టీ వాదనలు బూటకమైనవి. కేవలం ప్రతిపక్షాలను మాత్రం బద్నాం చేయాలనుకుంటోం ది” అని ప్రియాంక దుయ్యబట్టారు. ఏప్రిల్‌ 19 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జాలోర్‌కు ఏప్రిల్‌ 26న ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love