ఎర్రజెండాను అసెంబ్లీకి పంపాలి

ఏజెన్సీ గిరిజన పేదల హక్కుల కై పోరాడేది ఎర్రజెండా అని వాటి సాధనకై పోరాడే సీపీఎం పార్టీని అసెంబ్లీకి పంపించాలని, ఈ ఎన్నికల్లో– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసాలను నమ్మొద్దు
– భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య, సీపీఎం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ-వాజేడు
ఏజెన్సీ గిరిజన పేదల హక్కుల కై పోరాడేది ఎర్రజెండా అని వాటి సాధనకై పోరాడే సీపీఎం పార్టీని అసెంబ్లీకి పంపించాలని, ఈ ఎన్నికల్లో సిపిఎంను ఆదరించాలని నియోజకవర్గాన్ని అబివృద్ధి చేస్తా అని భద్రాచలం నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి అన్నారు. గురు వారం వాజేడు మండలంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజా బొజ్జి, సున్నం రాజయ్య వల్లే అభివృద్ధి జరిగిందని అన్నారు. నిత్యం పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండా పార్టీ అని, పొడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్‌ నిధులు, కూలి రేటు పెంపు పోరాటాలు చేసి సాధించిన ఘనత సీపీఎందని అన్నారు. పేదలకు ఇంటి జాగా కోసం గుడిసెల పోరాటం నిర్వహిస్తుం దని, తనను అసెంబ్లీ కి పంపిస్తే సమస్యలు పరిష్కారం అయ్యే దాక పోరాడుతా అని హామీ ఇచ్చారు. పోరాట చరిత్ర కలిగిన పుల్లయ్యను గెలిపించడం ద్వారా పేదల పక్షణ మాట్లాడే గొంతు అసెంబ్లీలో ఉంటుందని అన్నారు.ఏ నాడైనా ఇలాంటి పోరాటాలు కాంగ్రెస్‌, బీఆర్‌ ఎస్‌ చేసాయా అన్నారు. నిరంతరం పేదల పక్షణా నిలిచే సీపీఎంను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపిం చాలని కోరారు.గతంలో కాం గ్రెస్‌ నుండి గెలిచినా కుంజా సత్యవతి, ప్రస్తుతం వున్న పోదేం వీరయ్యలు పేద ప్రజ లను దోచుకున్నారని అన్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోలేదని అన్నారు. సమాజంలో సామజిక వివక్షకు గురయ్యే దళితుల వద్ద దళితబంధు పేరుతో లక్షల రూ పాయలు దండుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ కోసం పార్టీ లు మారే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్‌ అని, ఆయన పేదల సమస్యలు తెలియవని అన్నారు. ఎలాంటి నీతిలేని వారిని ఓట్లేసి గెలిపిస్తే ఇబ్బందులు తప్పవని అన్నారు. అరుగుంటపల్లి నుండి గుమ్మడి దొడ్డి వరకు ఇంటింట ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమం లో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బిరెడ్డ్‌ సాంబశివ, ఎండీ దావూడ్‌, రాజేందర్‌, మండల కార్యదర్శి కొప్పుల రఘపతి, మండల నాయకులు దామోదర్‌,దేవయ్య, కష్ణ బాబు, సంతోష్‌,రమాదేవి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love