వ్యవసాయ కార్మిక సమస్యలను పరిష్కరించాలని వినతి 

– అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ నెల్లికుదురు : వ్యవసాయ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహసిల్దారు కోడి చింతల రాజుకు వినతిపత్రాన్ని అందించడం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటేశ్వర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజంపల్లి వీరన్న లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా మండల కార్యవర్గం ఆధ్వర్యంలో తహసిల్దార్ కోడి చింతల రాజుకు మెమోరాండం ఇచ్చామని అన్నారు. 1948లో వ్యవసాయ కార్మిక చట్టం చేశారు కానీ దాన్ని అమలుకు పూలుకోలేదు. ఈ చట్టాన్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సవరణ చేస్తూ పకడ్బందీగా అమలు చేయాలి. దేశంలో 14 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు అని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ వలన వారికి పనులు, పని దినాలు తగ్గిపోయి అర్దాకలతో అలమటిస్తున్నారు. వారి పిల్లలకు విద్యా వైద్య పూర్తిస్థాయిలో అందక పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో 2,72,000 వేల కోట్ల బడ్జెట్ తో ఉన్న దానిని ప్రస్తుత బిజెపి మోడీ ప్రభుత్వం  73 వేల కోట్లకు తగ్గించి పేదలను ఇబ్బంది చేసే తప్ప అభివృద్ధి చేసేది లేదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చెందారు. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయుటకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఆవేదన వ్యక్తం చెందారు. అలాగే నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులకు 30 లక్షల కోట్ల రుణమాఫీ చేయడమే కాకుండా, వివిధ రాయితీల ద్వారా, వ్యాపార లాభాల పేరుతో 55 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచి పెట్టారు అని తెలిపారు.వ్యవసాయ  రంగంలో మహిళలది ప్రధాన పాత్ర ఉంటుంది. వారికి ఆరోగ్యశ్రీ ద్వారా లేదా ఉచితంగా ప్రభుత్వం అన్ని వ్యాధులకు వైద్యం అందించాలి అని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయని తదితర డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వటం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేశవులు,రాంనరసయ్య, రామకృష్ణ, నరేందర్ రాజయ్య, వెంకటయ్య, కృష్ణయ్య మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love