Thursday, April 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ డీజీపీకి ఘ‌నంగా వీడ్కోలు

మాజీ డీజీపీకి ఘ‌నంగా వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దీర్ఘకాలం సేవ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ పదవీ విరమణ సందర్భంగా RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలోని సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్‌లో గౌరవ వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతన డీజీపీ సి.వి. ఆనంద్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్టా, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. 1970-80లలో ఉన్న పోలీసింగ్ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని, ఇప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, 32 ఏళ్ల పోలీస్ సేవా జీవితంలో అనేక సవాళ్లు, ఆనందాలు, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని శివధర్ రెడ్డి తన వీడ్కోలు ప్రసంగంలో తెలిపారు. “నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -