- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్ ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో పంచుకున్న నెట్‌వర్క్ మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించడంతో తీవ్ర దుమారం రేగింది. భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో, నేపాల్ ఎయిర్‌లైన్స్ బుధవారం ఆ వివాదాస్పద పోస్ట్‌ను తొలగించింది. గురువారం సంస్థ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, భౌగోళిక దోషాలు తమ అధికారిక వైఖరిని ప్రతిబింబించవని, పొరపాటుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని తెలిపింది.
- Advertisement -



