ఉరివేసుకొని ఓ రౌడి షీటర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో జరిగింది. స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం మండలంలోని పేరాయిగూడెం పంచాయతీ మోడల్ కాలనీ కు చెందిన షేక్ మస్తాన్ (46) కారు డ్రైవర్ పని చేస్తూ, గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో పొరుగు వారితో గొడవపడి వారిని దుర్భాషలాడాడు. ఆ తర్వాత స్థానిక మోడల్ కాలనీలోని తన స్నేహితుడైన ఎండి జాఫర్ ఇంటికి వచ్చి ఉంటున్నాడు. ఈ నేపధ్యంలో గురువారం కుడా అతిగా మద్యం సేవించి, స్నేహితుడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్ఐ శ్రీను ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రి కు తరలించారు. మృతుడు ఐదేళ్ల క్రితం ఓ వివాహితను హతమార్చాడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ పై ఆశ్వారావుపేట పోలీస్ స్టేషన్ రౌడి షిట్ కుడా ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇతని భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి హైదరాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తుంది. దీనిపై మృతుడి కుమార్తె షాహనాజ్ చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఆత్మహత్యకు పాల్పడిన రౌడీషీటర్
నవతెలంగాణ – అశ్వారావుపేట