రవాణా రంగ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
రవాణా రంగ కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం డిమాండ్‌ చేశారు. గురువారం హిమాయత్‌నగర్‌లోని ఎన్‌.సత్యనా రాయణరెడ్డి భవన్‌లో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా నిర్మాణ మహాసభ కొమురరెల్లి బాబు అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా బి.వెంకటేశం మాట్లాడుతూ తక్కువ ఆదాయం, దుర్భరమైన జీవితాలు, అధికారుల నుంచి వేధింపులు, ఆరోగ్య సమస్యలు, సామాజిక భద్రత లేకపోవడం, రోడ్లపై అసురక్షిత భావన వంటి అనేక సవాళ్లను రవాణా రంగ కార్మికులు ఎదుర్కుంటున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రవాణా రంగ కార్మి కుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి, ఆటో డ్రైవర్లు చురుకైన పాత్ర పోషించారనీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్క రించడంపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తొమ్మిదేండ్లుగా ఒక్కసారి కూడా ఆటో మీటర్‌ చార్జీలు పెంచలేదనీ, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం వంద శాతం పెరిగాయన్నారు. కొత్త ఆటో పర్మిట ్‌లను జారీ చేయకపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపో తుందన్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా రవాణా అవసరాలు తీర్చడంలో ఆటో కార్మికులు సమా జంలో కీలకపాత్ర పోషిస్తున్నారని అందుకు ప్రభుత్వం వారిని గుర్తించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఈ విష యంలో వెంటనే స్పందించి ఆటో మీటర్‌ చార్జీలు కనీసం రూ.20 నుంచి రూ.40 వరకు కిలోమీటర్‌ కు రూ.20 పెంచాలనీ, కొత్త ఆటో పర్మిట్‌లను జారీ చేయాలనీ, పీఎఫ్‌, ఇన్సూరెన్సు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశా రు. దళితులకు దళిత బందు ఇస్తున్నట్టుగా చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా ఉన్న లైసెన్స్‌ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్లకు ‘ఆటో బందు’ అమలు చేయాలని కోరారు. ప్రమాదంలో చనిపోయిన ఆటో కార్మికులకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలనీ, సహజ మరణాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోడ్డు భద్రత పేరుతో దేశ ప్రజలను దోచుకోవడానికి నూతన మోటార్‌ వాహన సవరణ చట్టం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకవచ్చిందనీ, మోడీ ప్రభుత్వం తన మూర్కపు ఆలో చనలతో తీసుకువచ్చిన చట్టాలన్నీ ప్రజా వ్యతిరేక చట్టాలే అన్నారు. రవాణా రంగ కార్మికులతో సహా సామాన్య ప్రజ లను దోచుకోవడానికి తీసుకువచ్చిన మోటారు వాహన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దశాబ్ద కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమ స్యలు పరిష్కరానికి పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించా ల్సిన అవసరముందనీ, పోరాటంతోనే సమస్యలు పరిష్కా రమవుతాయని పేర్కొన్నారు. మహాసభలో ఏఐటీయూసీ హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, యూనియన్‌ జిల్లా నేతలు ఎ.బిక్షపతి యాదవ్‌, ఎండి.ఒ మర్‌ఖాన్‌, భైరగోని రాజు గౌడ్‌, సిహెచ్‌.జంగయ్య, ఎండి.ఫరూక్‌, ఎస్‌.కె.లతీఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love