పారిశుధ్య కార్యక్రమాలను ప్రారంభించిన ప్రత్యేక అధికారి

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం బాగేపల్లి, కునేపల్లి గ్రామాలలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. ఈనెల 7 నుంచి 14 వరకు గ్రామంలోని పరిసరాల పరిశుభ్రత, రోడ్లను శుభ్రం చేయడం, మురికి కాలువలో మట్టిని తొలగించడం, తదితర పనులను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బాగేపల్లి, కూనేపలి గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి జాజు శ్రీకాంత్, స్థానిక నాయకులు సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సుదర్శన్, అన్న నేను వాడు కార్యకర్త సరోజ, ఐకెపి సీఏ గంగామణి, ఆశ కార్యకర్త శివరంజని, కారోబార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love