ఆస్తి కాజేసేందుకే విగ్రహం డ్రామా..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
రాంకోఠిలో శ్రీ కృష్ణుడి విగ్రహం బయటపడిన ఉదంతం మిస్టరీని సుల్తాన్ బజార్ పోలీసులు తేల్చారు. ఆస్తి కాజేసేందుకే ఈ విగ్రహం డ్రామా అని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు బాధ్యులైన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై  ఇన్ స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న సుల్తాన్బ జార్ పీఎస్ పరిధిలో శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడినఘటనపై నవజీవన్ తపాడియా కళాశాల మేనేజింగ్ ట్రస్టీ సుశీల్ కపాడియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మాజీ ఉద్యోగి కావేరి సత్యనారా యణ(70), పెద్దకాడ గంగారాం(27), ఎర్రోళ్ల సాయిలు(40), గువ్వ సాయిలు (40) కలిసి ఈ నెల 17న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇనుపరాడ్తో కళా శాల గేట్ తాళం పగులగొట్టి, రామాంజనేయ ఆలయం నుంచి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు.
ఆ తర్వాత కళాశాలలో తవ్విన గుంతలో ఆ విగ్రహాన్ని ఉంచి.. ఇసు కతో ఆ గుంతను మూసివేశారని వివరించారు. ఈనెల19న ఉదయం ప్రధాన నిందితుడైన సత్యనా రాయణ ఈ విషయాన్ని నీలేష్ కుమార్ ద్వివేదికి తెలి పాడు. ఆ తర్వాత కళాశాల ఆవరణలో శ్రీకృష్ణుడి విగ్ర హాన్ని కమలేశ్వర్ శాస్త్రి గుర్తించారు. అమృత్ కపాడియా కళాశాలలో శ్రీ కృష్ణుడి విగ్రహం బయటపడిందన్న వార్త ఒక్కసారిగా వైరల్ కావడంతో.. స్థానికులు ఆ విగ్రహాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. నిందితులందరూ కుమ్మక్కై కళాశాల ఆస్తిని కాజేసేందుకే ఈ కుట్రకు తెరలే పారని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. కలకలం రేపిన ఈ ఘట నను 48 గంటల్లో ఛేదించి, నిందితులను అరెస్టు చేసిన ఎస్ఐలు నరేశ్, కిరణ్ కుమార్ రెడ్డి, సిబ్బందిని ఇన్ స్పెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
Spread the love