– గర్వంగా ఉంది : ప్రిన్సిపాల్ బలరాం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలల సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇగ్నైట్ ఫెస్ట్‌లో కొడంగల్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి పి.హరిచంద్ వివిధ అంశాలలో జూనియర్ విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా గణతంత్ర దినో త్సవం పురస్కరిం చుకుని గురుకుల విద్యాలయాల సం స్థల కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్, డిప్యూటీ కార్యదర్శి డీ.శ్రీనివాసరెడ్డిలు విద్యార్థికి పురస్కారంతోపాటు రూ.ఐదు వేల నగదు, ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం, ఉపాధ్యాయులు హరిచంద్‌ను సత్కరించారు. కొడంగల్ విద్యార్థి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరచడం అందరికీ గర్వకారణం అని, ఇది అందరి సహకారంతో సాధ్యపడిందని ప్రిన్సిపాల్ తెలిపారు.