నిర్ణీత సమయంలోగా ఏకరూప దుస్తులు అందించాలి

– డీపీఎం వెంకటేష్‌
– ఏకరూప దుస్తుల పంపిణీ
నవతెలంగాణ- తెలకపల్లి
ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి విద్యార్థుల యొక్క ఏకరూప దుస్తులను ఆయా పాఠశాలకు తప్పనిసరిగా అందించాలని మండల మహిళా సంఘాల సభ్యులకు డీపీఎం వెంకటేష్‌ సూచించారు. శుక్రవారం మండల కేంద్రం లోని విద్యా వనరుల కేంద్రం నందు 10 పాఠశాలల కు సంబంధించిన 468 విద్యార్థుల యొక్క ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి ఎస్‌.చంద్రుడు చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఈ ఏకరూప దుస్తులను విద్యా సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభమ య్యే రోజున విద్యార్థులకు అందించాలని ప్రధానోపా ధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు బాలస్వామి, నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, మహిళా సమాఖ్య ఏపీఎం నిరంజన్‌, సీసీఎస్‌ నిరంజన్‌, సుజాత, మమత మహిళా సం ఘాల సభ్యులు భాగ్యలక్ష్మి, విజయ, ప్రసన్న, లిఖిత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
ఉప్పునుంతల: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు మొదటగా 8 పాఠశాలలకు శుక్రవారం మండల కేంద్రంలో ఎంఈఓ ఆఫీస్‌ నుంచి పెద్దా పూర్‌, మొల్గర, కొత్త రామ్‌నగర్‌, పిరట్వానిపల్లి, రాయిచెడు, గట్టుకడిపల్లి, పూర్వ నాయక్‌ తండ, సీబీ తండా గ్రామాలలోని పాఠశాల ప్రధానోపాధ్యాయు లకు ఎంఈఓ రామారావు చేతుల మీదుగా అందిం చారు. కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాసులు, ఏపీఎం సైదులు, మండలలోని ప్రధానోపాధ్యాయులు, మహి ళా శక్తి కుట్టు కేంద్రం మహిళా సభ్యులు పాల్గొన్నారు.
బిజినేపల్లి: మండలంలోని నూతన విద్యా సంవత్సర విద్యార్థులకు ఏకరూప దుస్తులు మొదట గా వెలుగొండ, మంగనూరు, గౌరారం, శ్రీవాణి విద్యాలయం వట్టెం, రూపుల తండా, వైయస్‌ కాలనీ గౌరారం పాఠశాలలో దుస్తుల పంపిణీ చేశారు. కార్య క్రమంలో జిల్లా డీపీఎం అనురాదాదేవి, మండల ఏపిఎం రజిత, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు మహిళా శక్తి కుట్టు కేంద్రం మహిళలు పాల్గొన్నారు.

Spread the love