దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ మహిళ ఆత్మ హత్యా యత్నం

నవతెలంగాణ హైదరాబాద్‌: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ మహిళ(25) ఆత్మ హత్యా యత్నా నికి పాల్పడింది. కేబుల్ బ్రిడ్జి పై నుంచి దుర్గం చెరువులోకి దూకడానికి యత్నించిన మహిళను మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. అప్పటికే తాను నిద్రమాత్రలు మింగానని పోలీసులకు తెలపడంతో వెంటనే వారు స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రేమ వ్యవహారమా? లేక కుటుంబ కలహాల అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love