రోడ్ల పైన పడిన పత్తి ఎరుకొని పొట్ట నింపుకుంటున్న యువకుడు..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని జుక్కల్ నుండి మద్నూర్ వెళ్లే నాలుగు వరుసల రోడు వెంట జుక్కల్ , మద్నూర్ మండలాలలోని గ్రామాల రైతులు పండించిన పత్తి పంటను మద్నూర్ మార్కేట్ యార్డుకు తీసుకోస్తారు. రెండు మండలాలకు ఉమ్మడి మార్కేట్ కార్యాలయం ఒక్కటే కావడంతో రద్ది బాగా ఉండి పత్తి అమ్మకాలు కోనసాగుతాయి. అయితే రోడు నుండి వస్తున్న పత్తిపంటను అమ్మకానికి మద్నూర్  మార్కేట్ కు వాహనాలలో తరలిస్తున్న క్రమంలో పత్తి పంట రోడ్ల వెంట అక్కడక్కడ పడి పోతుండటంతో,   గ్రామాలలో ఖాలీగా  ఉన్న యువకులు కష్టం చేయకుండానే రోజుకు పదికిలోల వరకు పత్తిని రొడ్ల వెంట పడిన వాటిని ఎరుకొని వ్యాపారులకు, కిరాణ దుకాణాలలో అమ్మకాలు చేసి రోజుకు ఐదారువందలు సంపాదిస్తున్నారు. వృదాగా పోయే పత్తిని జుక్కల్ మండలానికి చెందిన యువకులు, మహిళలు కూడా ఈజీ మణి వస్తుందనే ఉద్దేశంతో ఈపని చేసి రోజు వారి కూలీ పడేవిధంగా సంపాదిస్తున్నారు. పెట్టుబడి పెట్టకుండా, తక్కువ కష్టం చేసి రోజుకు ఐదు నుండి పదికిలోల వరకు సేకరిస్తామని, రోజువారి కూలీ పొందడం వలన ఇంటి ఖర్చులకు ఉపయేాగపడు తున్నాయని జుక్కల్ మండలంలోని చండేగాం గ్రామ వాసి బస్వరాజ్ నవతెలంగాణ తో తెలిపారు.
Spread the love