త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మరో తీపి కబురు : పొంగులేటి

నవతెలంగాణ హుజూర్‌నగర్‌: కలెక్టర్ల సమావేశం తర్వాత  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా తీపి కబురు చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని విమర్శించారు. హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి(Minister Uttam kumar Reddy)తో కలిసి పొంగులేటి పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. హుజూర్‌నగర్‌లో గత ప్రభుత్వం కేవలం 150 ఇండ్లు మాత్రమే కట్టిందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇండ్లు కట్టామన్నారు. హుజూర్‌నగర్‌లో 2,160 ఇండ్లు పూర్తి చేసి, రాబోయే 3, 4 నెలల్లో అర్హులైన పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇరిగేషన్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.

Spread the love