నవతెలంగాణ-హైదరాబాద్: ఆప్ నేత దీపక్ సింగ్లాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సోమవారం అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. బ్యాంక్ రుణ మోసంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ రాజకీయ నేతలు సహా మరికొందరి నివాసాల్లో ఈడీ సోమవారం ఉదయం సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ, గోవాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని సుభాష్ నగర్ లో బాబాజీ ఫైనాన్స్ గ్రూప్‌కి చెందిన రామ్ సింగ్ నివాసంపై దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. సింగ్లా విశ్వాస్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2024లో మరో కేసులో కూడా ఇడి ఆయన నివాసంపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల మోసం కింద కొంతమంది వ్యక్తులను రూ.180 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు నిర్వహించింది.
ఆప్ నేత దీపక్ సింగ్లా అరెస్ట్
- Advertisement -
- Advertisement -



