నవతెలంగాణ – న్యూఢిల్లీ : అశోక్ కుమార్ మిట్టల్, రాఘవ్ చద్దాతోపాటు ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో వీలైనమనట్లు శుక్రవారం ప్రకటించారు. తాజాగా ఈ ఎంపీలందరిపై అనర్హత వేటు వేయమని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఆదివారం రాజ్యసభ ఛైర్మన్ సి. పి రాధాకృష్ణన్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఫిరాయింపులు ముఖ్యంగా పంజాబ్‌లో ప్రజల తీర్పుకు ద్రోహం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని` ఆయన ఆరోపించారు. పార్టీని వీడిన ఏడుగురిలో ఆరుగురు పంజాబ్ కు చెందినవారే. ఈ విషయంపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సహా రాజ్యాంగ నిపుణులను ఆప్ సంప్రదించింది. చట్టం ప్రకారం బిజెపిలో విలీనమైన ఈ ఎంపీలు అనర్హతకు గురవుతారని వారు స్పష్టం చేశారు. ఈ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ చేత ఎన్నికై, ఆ తర్వాత పార్టీని వీడి మరో పార్టీలో చేరారు. ఇది పంజాబ్ ప్రజలకు, అలాగే భారత రాజ్యాంగానికి చేసిన ద్రోహం,” అని ఆయన అన్నారు.
పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి
- Advertisement -
- Advertisement -



