అభిషేక్‌, ప్రణీత్‌ అగ్రస్థానం

అభిషేక్‌, ప్రణీత్‌ అగ్రస్థానం– జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌
న్యూఢిల్లీ: జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అభిషేక్‌ వర్మ-ప్రణీత్‌ కౌర్‌ సత్తా చాటారు. కాంపౌడ్‌ పురుషుల, మహిళల ర్యాంకింగ్స్‌ రౌండ్‌లో వీరు అగ్రస్థానంలో నిలిచారు. ఈ క్రమంలో అభిషేక్‌ వర్మ 714పాయింట్లతో జాతీయ రికార్డును సమం చేయగా.. మహిళల విభాగంలో వెన్నం జ్యోతి సురేశ(709) పేర ఉన్న రికార్డు పదిలంగా ఉంది. మహిళల విభాగంలో ప్రణీత్‌ కౌర్‌, మధుర 355పాయింట్లతో సమంగా ఉన్న క్రమంలో.. ఫలితం కోసం పర్ఫెక్ట్‌ టెన్‌ను నిర్దేశించగా.. ప్రణీత్‌ 59పాయింట్లతో విజయం సాధించగా… మథుర 2వ స్థానానికి పరిమితమైంది. తొలిరోజు పోటీలు ముగిసేసరికి పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్‌ వర్మ(ఢిల్లీ) 714 అగ్రస్థానంలోఉండగా.. కుందేరు వెంకటాద్రి(సర్వీసెస్‌(710 పాయింట్లు), ప్రథమేశ్‌(707పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మహిళల విభాగంలో ప్రణీత్‌(పంజాబ్‌) 707పాయింట్లు అగ్రస్థానంలో నిలువగా.. మథుర(మహారాష్ట్ర) 707పాయింట్లు, జస్వీర్‌ కౌర్‌(రైల్వేస్‌) 703పాయింట్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Spread the love