ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎబివిపి దిష్టిబొమ్మ దగ్దం…

నవతెలంగాణ; బోధన్ టౌన్ 
ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ తో పాటు జిల్లా నాయకత్వంపై ఎబివిపి గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. బోధన్ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎబివిపి దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అనంతరం బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలో ఈనెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్లీనరి సమావేశాలను విజయవంతం కాకుండా చేయడం కోసం బరితెగించిన ఎబివిపి గుండాలు ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై దాడి చేశారు. ఎబివిపి నాయకులకు సైద్ధాంతికంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ విధంగా దాడికి పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఎబివిపి నిజంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయితే యూనివర్సిటీలలో పెండింగ్ లో ఉన్న ఫెలోషిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ లను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పోరాడండి.నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న లోపాలను సరిచేసి, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలని సవాల్ విసిరారు.
Spread the love